May 19,2023 08:22

ఈ ఎండల వేళ.. చెమటలు, ఉక్కబోతతో శరీరం బాగా నీరసించి పోతుంది. ఆకలి అయినా ఎక్కువగా తినాలని అనిపించదు. నీరసం తగ్గి, వెంటనే శక్తి పొందాలంటే సగ్గుబియ్యం జావ మంచి ఆహారం. శరీరంలో అధిక వేడిని తగ్గించి, బలం ఇచ్చే పదార్థాల్లో సగ్గుబియ్యం ముందు వరసలో ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇంకా సగ్గుబియ్యం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.

  • శరీరంలోఎలక్ట్రోలైట్‌ సమతుల్యతను క్రమబద్దీకరిస్తుంది. దాంతో నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడి, నీరసం తగ్గుతుంది.
  • సగ్గుబియ్యంలో అధిక పొటాషియం- పొటాషియం వాసోడైలేటర్‌గా పనిచేస్తుంది. ఇది రక్త నాళాలలో ఉద్రిక్తతను తగ్గించి, రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. దాంతో రక్తపోటు తగ్గి హృదయనాళ వ్యవస్థ ఒత్తిడిని తగ్గిస్తుంది.
  • ఇందులో ఫైబర్‌ ఉండి జీర్ణక్రియను సాధారణ స్థితిలో ఉంచుతుంది. శరీర దృఢత్వానికి దోహాదం చేస్తుంది. ఎముక సాంద్రతను పెంచుతుంది.
  • సగ్గుబియ్యంలో రాగి, ఇనుము, కాల్షియం ఉండి ఎముక కణజాలాన్నీ వృద్ధి చేస్తాయి. దాంతో ఎముకల వ్యాధులు తగ్గుతాయి.
  • వీటిలోని కార్బోహైడ్రేట్స్‌ అధిక శక్తిని అందించి, కండరాల పునరుద్ధరణ వేగాన్ని పెంచడంలో సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. దాంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
  • ఎర్ర రక్త కణాల సంఖ్యను మెరుగుపరచడం, శరీరంలోని లోపలిభాగాలకు రక్త ప్రసరణ సమర్థవంతంగా అందేలా చేస్తుంది.