- ఎలెక్టా ఇండియా ఎండి వెల్లడి
హైదరాబాద్ : క్యాన్సర్ చికిత్సలో వినూత్న పరిష్కారాలు అందించడమే లక్ష్యంగా తమ సంస్థ పని చేస్తుందని ఎలెక్టా ఇండియా ఎండి మణికందన్ బాలా పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎలెక్టా అత్యాధునిక క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స యంత్రాలను తయారు చేస్తుందన్నారు. దేశంలోని 700 పైగా జిల్లాలుంటే.. అందులో వంద జిల్లాల్లో మాత్రమే క్యాన్సర్ చికిత్స సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా ఈ సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 2020లో 13.25 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని అన్నారు. ప్రతీ ఏడాది 12.48 శాతం పెరుగుదల చోటు చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయన్నారు.










