బెంగళూరు : టయోటా కిర్లోస్కర్ మోటర్ (టికెఎం) తమ నూతన ఇన్నోవా క్రిస్టా రెండు గ్రేడ్స్ (జెడ్‌ఎక్స్, విఎక్స్) ధరలను మంగళవారం ప్రకటించింది. ఐదు వేరియంట్లలో ఆవిష్కరించిన దీని ధరల శ్రేణీని రూ.23.79 లక్షల నుంచి రూ.25.43 లక్షలుగా నిర్ణయించింది. ప్రీమియం కలర్స్‌కు అదనపు ధరలు వర్తిస్తాయని తెలిపింది. ఎకో, పవర్ డ్రైవ్ మోడ్స్‌లో 2.4 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో నూతన క్రిస్టాను ఆవిష్కరించింది. తమ డీలర్స్ వద్ద రూ.50వేల చెల్లించి బుక్ చేసుకోవచ్చని ఆ కంపెనీ పేర్కొంది.










