బెంగళూరు : గత కొన్ని నెలలుగా వేతన పెంపును వాయిదా వేస్తూ వస్తోన్న దిగ్గజ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ ఎట్టకేలకు తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. నవంబర్ 1 నుంచి పెంపు ఉంటుందని అధికారికంగా వెల్లడించింది. సామర్థ్యాలను పెంచుకోవడానికే జీతాలు ఆలస్యంగా పెంచాల్సి వచ్చిందని చీఫ్ ఫైనాన్సీయల్ ఆఫీసర్ నిలంజన్ రారు పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లోనే జీతాలు పెంచుతూ వస్తోంది. కానీ.. ఈ ఏడాది ఆలస్యం అయ్యింది.