Oct 10,2023 21:12

న్యూఢిల్లీ : భారత వృద్థి రేటు పడిపోనుందని ప్రపంచ బ్యాంక్‌ బాటలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఐఎంఎఫ్‌ తాజా రిపోర్ట్‌ స్పష్టం చేస్తోంది. 2023లో ప్రపంచ వృద్థి రేటు 3 శాతం పెరుగొచ్చని పేర్కొంది. 2024లో 10 బేసిస్‌ పాయింట్లు తగ్గి 2.90 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతోన్నామని ప్రధానీ మోడీ పదేపదే చెబుతున్న మాటలకు భిన్నంగా ఈ అంచనాలు వెలుపడటం గమనార్హం. ఇంతక్రితం 2022-23లో భారత స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 7.2 శాతంగా నమోదయ్యింది. 2021-22లో 9.1 శాతం వృద్థి చోటు చేసుకుంది.