న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత వృద్థి రేటు 5.9 శాతానికే పరిమితం కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) తెలిపింది. 2022-23లో 6.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. దీంతో పోల్చితే భారీ తగ్గుదలనే చోటు చేసుకోనుంది. 2023-24లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. 2023లో ప్రపంచ వృద్థి రేటు 2.78 శాతానికి తగ్గొచ్చని.. వచ్చే ఏడాది 3 శాతంగా ఉండొచ్చని విశ్లేషించింది. 2023-24లో భారత వృద్థి రేటు 6.3 శాతంగా ఉండొచ్చని ఇటీవల ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 6.4 శాతం నమోదు కావొచ్చని ఆర్‌బిఐ పేర్కొనగా.. 6 శాతమే ఉండొచ్చని ఎస్‌అండ్‌పి గ్లోబల్ రేటింగ్ సంస్థ విశ్లేషించింది.










