Jan 09,2023 15:44

గౌహతి: భారత పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. మరికొంతకాలం బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బిసిసిఐ నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. వెన్నెముక గాయం నుంచి కోలుకున్న బుమ్రా.. జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్‌ క్లీన్‌చిట్‌ పుచ్చుకున్నాడు. దీంతో సెలక్షన్‌ కమిటీ బుమ్రా వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉన్నాడని ప్రకటించినా.. బిసిసిఐ యూ టర్న్‌ తీసుకుంది. అతడిని ఆడించే విషయంలో తొందరపాటు వద్దని మరింత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో వన్డే సిరీస్‌ నుంచి తప్పించనుంది. ఫిబ్రవరిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది.