హైదరాబాద్ : భారత ఫుట్‌బాల్ లెజెండ్, హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ హబీబ్ కన్నుమూశారు. డిమెన్షియా, పార్కిన్సన్ సిండ్రోమ్ సహా వయసు రీత్యా సమస్యలతో ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మరణించారు. ఆయన 1965 నంచి 1976 మధ్య కాలంలో ఇండియా ఫుట్ బాల్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. 1970లో థారులాండ్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన ఇండియా ఫుట్‌బాల్ టీమ్‌లో హబీబ్ ఉన్నారు. ఈ జట్టుకు మరో హైదరాబాదీ ప్లేయర్ సయ్యద్ నయీముద్దీన్ కెప్టెన్‌గా వ్యవహరించారు. మహమ్మద్ హబీబ్ 1949 జులై 17వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. అదే హైదరాబాద్‌లో 74 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. హబీబ్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.