Jun 29,2023 07:04
  • శాఫ్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌

బెంగళూరు: శాఫ్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో లీగ్‌ పోటీలు ముగిసాయి. బుధవారం జరిగిన గ్రూప్‌-బి ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో లెబనాన్‌ జట్టు 1-0తో మాల్దీవులను, బంగ్లాదేశ్‌ జట్టు 3-1తో బూటాన్‌ను ఓడించాయి. దీంతో ఈ గ్రూప్‌లో లెబనాన్‌ జట్టు అగ్రస్థానంలో, బంగ్లాదేశ్‌ జట్టు రెండోస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరాయి. మంగళవారం జరిగిన గ్రూప్‌-ఏ లో కువైట్‌, భారత్‌ జట్టు 1, 2 స్థానాల్లో నిలిచి సెమీస్‌కు చేరడంతో గ్రూప్‌-ఏలో అగ్రస్థానంలో ఉన్న కువైట్‌ జట్టు గ్రూప్‌-బిలో రెండోస్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌తో తొలిసెమీస్‌లో ఆడనుంది. ఇక గ్రూప్‌-ఏలో రెండోస్థానంలో ఉన్న ఆతిథ్య భారతజట్టు గ్రూప్‌-బిలో అగ్రస్థానంలో ఉన్న లెబనాన్‌ జట్టు రెండో సెమీస్‌లో తలపడనుంది. ఈ రెండు సెమీస్‌ పోటీలు శనివారం జరగనున్నాయి.

2