Nov 10,2023 11:53

న్యూఢిల్లీ :   అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ గురువారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్‌లో శుక్రవారం జరగనున్న 2+2 విదేశీ మరియు రక్షణ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. భారత్‌ తరపున ఈ సదస్సుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరియు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జయశంకర హాజరుకానున్నారు. 5వ భారత్‌ -అమెరికా మంత్రుల సదస్సులో పాల్గనేందుకు ఢిల్లీకి వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు ఘన స్వాగతం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ఎక్స్‌ లో పేర్కొన్నారు. ఈ పర్యటన భారత్‌, అమెరికా అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఊతమిస్తుందని అన్నారు.