రమల్లా : అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఆదివారం అత్యం త కట్టుదిట్టమైన భద్రతల మధ్య ఇజ్రాయిల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ను సందర్శించారు. పాలస్తీనా అధ్యక్షుడు మహముద్ అబ్బాస్‌తో సమావేశమైన ఫోటోను పాలస్తీనా అధికారులు విడుదల చేశారు. అమెరికా అత్యున్నత దౌత్యవేత్త అబ్బాస్‌తో రమల్లాలో భేటీ అయినట్లు తెలిపారు. బ్లింకెన్ జోర్డాన్‌తో పాటు శుక్రవారం ఇజ్రాయిల్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే భద్రతా కారణాల రిత్యా ముందుగా ఈ పర్యటనను ప్రకటించలేదని సంబంధితవర్గాలు తెలిపాయి. అక్టోబర్ ఏడు నుండి గాజాస్రిప్ పై ఇజ్రాయిల్ దాడులు చేపట్టిన తర్వాత బ్లింకెన్ వెస్ట్ బ్యాంక్ లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.