- నేటితో ముగిసిన ప్రి క్వార్టర్స్ పోటీలు
సిడ్నీ: ఫిఫా మహిళల ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్లోకి ఫ్రాన్స్, కొలంబియా జట్లు ప్రవేశించాయి. మంగళవారం జరిగిన ఆఖరి ప్రి క్వార్టర్స్ పోటీల్లో ఫ్రాన్స్ జట్టు మొరాకను, కొలంబియా జట్టు జమైకాను ఓడించాయి. తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు 4-0గోల్స్ తేడాతో మొరాకోపై ఘన విజయం సాధించింది. ఫ్రాన్స్ తరఫున డియానీ(15వ ని.), కెంజా డాలీ(20వ ని.), యజెనీ(23, 70వ ని.)లో రెండు గోల్స్ కొట్టారు. మరో ఉత్కంఠ పోటీలో కొలంబియా జట్టు 1-0గోల్స్ తేడాతో జమైనాను చిత్తుచేసింది. కొలంబియా తరఫున ఏకైక గోల్‌ను కాలలిన ఉష్మే(51వ ని.)లో చేసింది. నేటితో ప్రి క్వార్టర్స్ పోటీలు ముగియగా.. శుక్రవారం(ఆగస్టు 11) నుంచి క్వార్టర్‌ఫైనల్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
క్వార్టర్‌ఫైనల్స్..
11(శుక్ర) : స్పెయిన్ × నెదర్లాండ్స్(ఉ.6.30గం||లకు)
జపాన్ × స్వీడన్(మ.1.00గం||లకు)
12(శని) : ఆస్ట్రేలియా × ఫ్రాన్స్(మ.12.30గం||లకు)
ఇంగ్లండ్ × కొలంబియా(సా.4.00గం||లకు)