కొలంబో : ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఆతిథ్య శ్రీలంకతో మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.. దునిత్ వెల్లలాగే 5 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ 42 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
214 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంకకు మూడో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన పథుమ్ నిశ్శంక, బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 16 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన కుసాల్ మెండిస్ కూడా బుమ్రా బౌలింగ్‌లోనే సూర్యకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 18 బంతుల్లో 2 పరుగులు చేసిన దిముత్ కరుణరత్నేని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక కలిసి నాలుగో వికెట్‌కి 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..31 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసిన సదీర సమరవిక్రమ, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 35 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసిన చరిత్ అసలంక కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన లంక కెప్టెన్ దసున్ శనకని రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. అయితే ధనంజయ డి సిల్వ, దునిత్ వెల్లలాగే కలిసి ఏడో వికెట్‌కి 75 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 66 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వ, జడ్డూ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 14 బంతుల్లో 2 పరుగులు చేసిన మహీశ్ తీక్షణ, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 1 పరుగు చేసిన రజితని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పథిరాణా కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 5 వికెట్లు తీసిన యంగ్ బౌలర్ దునిత్ వెల్లలాగే 46 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయగా, జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు 2, సిరాజ్ కు 1, హార్దిక్ పాండ్యాకు 1 వికెట్ దక్కాయి.
కాగా,లంక గత 13 వన్డేల్లో ఓటమి లేకుండా వస్తోంది. ఇప్పుడా జైత్రయాత్రకు భారత్ అడ్డుకట్ట వేసింది. ఆసియా కప్ సూపర్-4 దశలో భారత్ తన తదుపరి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఈ నెల 15న ఆడనుంది.
భారత్ 213ఆలౌట్
వెల్లలగె, అసలంక ఉచ్చులో భారత బ్యాటర్స్
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక స్పిన్ ఉచ్చుతో భారత్‌ను దెబ్బకొట్టించింది. దీంతో టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 49.1ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ(53) టాప్ స్కోరర్. కేఎల్ రాహుల్(39), ఇషాన్ కిషన్(33) ఫర్వాలేదనిపించారు. శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే(5/40), చరిత అసలంక(4/18) మెలికలు తిరగే స్పిన్‌కు భారత బ్యాటర్స్ పెవీలియన్‌కు క్యూ కట్టారు. ఒకానొక దశలో టీమిండియా స్కోర్ 200 పరుగులైనా దాటుతుందా? అనే సందేహం కలిగింది. చివర్లో అక్షర్ పటేల్(26) మహమ్మద్ సిరాజ్(5 నాటౌట్)తో కలిసి చివరి వికెట్‌కు విలువైన 26 పరుగులు జోడించడంతో భారత్ గౌరవప్రద స్కోర్‌కు చేరింది. 49వ ఓవర్ తొలి బంతిని భారీ షాట్ ఆడిన అక్షర్ పటేల్ బౌండరీ వద్ద సమరవిక్రమ చేతికి చిక్కాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(53), శుభ్‌మన్ గిల్(19) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. ఆ తర్వాత వెల్లలాగే రాకతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. పాకిస్తాన్‌పై సెంచరీలతో కదం తొక్కిన కోహ్లి(3) నిరాశపరిచినా.. కెఎల్ రాహుల్ (39) ఫర్వాలేదనిపించాడు.
స్కోర్‌బోర్డు...
ఇండియా ఇన్నింగ్స్: రోహిత్ (బి)వెల్లలగె 53, శుభ్‌మన్ (బి)వెల్లలగె 19, కోహ్లి (సి)శనక (బి)వెల్లలగె 3, ఇషాన్ (సి) వెల్లలగె (బి)అసలంక 33, కేఎల్ రాహుల్ (సి అండ్ బి) వెల్లలగె 39, హార్దిక్ (సి)కుశాల్ (బి)వెల్లలగె 5, జడేజా (సి)కుశాల్ (బి)అసలంక 4, అక్షర్ (నాటౌట్) 15, బుమ్రా (బి)అసలంక 5, కుల్దీప్ (సి)ధనుంజయ (బి)అసలంక 0, సిరాజ్ (నాటౌట్) 2, అదనం 19. (47ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 197పరుగులు.
వికెట్ల పతనం: 1/80, 2/90, 3/91, 4/151, 5/170, 6/172, 7/178, 8/186, 9/186
బౌలింగ్: రజిత 4-0-30-0, తీక్షణ 8-0-29-0, శనక 3-0-24-0, పథీరన 3-0-27-0, వెల్లలగె 10-1-40-5, ధనుంజయ 10-0-28-0, అసలంక 9-1-18-4.
- జడేజా ఔట్
అసలంక బౌలింగ్‌లో జడేజా కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. టీమిండియా 178 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. క్రీజులో అక్షర్ పటేల్, బుమ్రా ఉన్నారు.
- పాండ్యా ఔట్
5 పరుగులు చేసిన పాండ్యా వెల్లగే బౌలింగ్‌లో కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 172/6గా ఉంది.
- ఐదో వికెట్ కోల్పోయిన భారత్
అసలంక బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(33) అవుట్. పాండ్యా, జడేజా క్రీజులో ఉన్నారు.
- రాహుల్ ఔట్
నిలకడగా ఆడుతున్న రాహుల్‌ను వెల్లగే బౌల్డ్ చేశాడు. ఇషాన్ కిషన్(24), హార్దిక్ పాండ్యా క్రీజులో ఉన్నారు. స్కోరు: 154-4(30)
- రోహిత్ అవుట్.. టీమిండియా : 91/3
లంక స్పిన్నర్ వెల్లగే బౌలింగ్‌లో రోహిత్(53)ను బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు గిల్, కోహ్లీ వెల్లగే బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు.
- షాక్ కోహ్లీ ఔట్.. టీమిండియా : 90/2
పాకిస్తాన్‌పై 122 పరుగులు చేసిన విరాట్ కోహ్లి శ్రీలంకపై 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెల్లగే బౌలింగ్‌లో శనకకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి ఇషాన్ కిషాన్ వచ్చాడు. టీమిండియా ప్రస్తుతం 14 ఓవర్లలో 90 పరుగులకు 2 వికెట్లను కోల్పోయింది.
- రోహిత్ హాఫ్ సెంచరీ
రోహిత్ శర్మ. 44 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ప్రస్తుతం టీమిండియా 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది.
- గిల్ ఔట్ .. టీమిండియా తొలి వికెట్ డౌన్..
శుబ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. వెల్లగే బౌలింగ్‌లో గిల్(19) బౌల్డ్ అయ్యాడు. కోహ్లి, రోహిత్ క్రీజులో ఉన్నారు.
- 10 ఓవర్లకు 65 పరుగులు
10 ఓవర్లలో టీమిండియా 65 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 37 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్ సాయంతో 39 పరుగులు, గిల్ 23 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 28 పరుగులు పూర్తి చేశారు. మరోవైపు లంక బౌలర్లు వికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
- 8 ఓవర్లు పూర్తి.. టీమిండియా 44/0
8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 44 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును పెంచుతున్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ 28 బంతుల్లో 23 పరుగులు, శుభ్‌మాన్‌గిల్ 16 బంతుల్లో 13 పరగులు చేశారు.
- 5 ఓవర్లుకు 25
శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. రోహిత్‌శర్మ, శుభ్‌మాన్‌గిల్ బ్యాటింగ్‌ను ప్రారంభించారు. ఐదు ఓవర్లు ముగిసే సరికి భారత్ 25 పరుగులు చేసింది. రోహిత్ 20 బంతుల్లో 12, గిల్ 10 బంతుల్లో 12 పరుగులు చేశారు.
- టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్
ఆసియా కప్-2023 సూపర్-4లో భాగంగా శ్రీలంకతో టీమిండియా నేడు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.
తుదిజట్లు:
టీమిండియా : రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
శ్రీలంక: పాథుమ్ నిస్సాంకా, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లగే, మహీష్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరణ










