ప్రపంచకప్ లో భాగంగా ఆసీస్-ఇండియా జట్ల మద్య జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆసీస్ 49.3ఓవర్లకు 199 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
- జంపా ఔట్
20 బంతుల్లో 6 పరుగులు చేసిన జంపా హర్దిక్ పాండ్యా బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి హెజల్‌వుడ్ వచ్చాడు. స్టార్క్ 24 పరుగులు మీద బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
- ప్యాట్ కమ్మిన్స్ ఔట్
165 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్.. బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి జంపా వచ్చాడు.
- గ్రీన్ ఔట్
అశ్విన్ బౌలింగ్‌లో 8 పరుగులు చేసిన గ్రీన్ పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా 7 వికెట్ కోల్పొయింది. ప్రస్తుతం ఆసీస్ 140/7గా ఉంది. క్రీజులోకి స్టార్క్ వచ్చాడు.
- కష్టాల్లో పడ్డ ఆసీస్.. మాక్స్‌వెల్ ఔట్
కుల్దీప్ బౌలింగ్లో మాక్సీ(15) అవుట్. ఆరో వికెట్ కోల్పోయి కష్టలో పడింది. క్రీజులోకి ప్యాట్‌కమిన్స్ వచ్చాడు. ఆసీస్ ప్రస్తుతం 140 పరుగులు చేసింది.
- 35 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 138/5
35 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. మాక్సీ 14, గ్రీన్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
- ఒకే ఓవర్‌లో 2 వికెట్లు.. ఆసీస్ 119/5
టిమీండియా ఆల్‌రౌండర్ రవీంద్రజడేజా ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీశాడు. తొలుత లబుషేన్‌ను ఔట్ చేసిన జడేజా.. క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యారీని ఎల్బీగా వెన్కక్కి పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 30 ఓవర్లు ముగిసే సరికి 119 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.
- లబుషేన్ ఔట్
జడేజా బౌలింగ్‌లో లబుషేన్(27) కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులోకి మాక్స్‌వెల్ వచ్చాడు.
- స్మిత్ క్లీన్ బౌల్డ్
46 పరుగులు చేసిన స్మిత్‌ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా110 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్, అలెక్స్ క్యారీ ఉన్నాడు.
- 25 ఓవర్లు పూర్తి.. ఆసీస్ 102/2
25 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. స్మిత్ 66 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 43 పరుగులు, లబుషేన్ 26 బంతుల్లో 17 పరుగులు చేశాడు. అంతకు ముందు వార్నర్ 41 పరుగులు, మిచెల్ మార్ష్ డక్‌ఔట్‌గా పెవిలియన్‌కు చేరారు.
- డేవిడ్ వార్నర్ ఔట్
41 పరుగులు చేసిన వార్నర్‌ను కుల్దీప్ అద్బుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులోకి లబుషేన్ వచ్చాడు.
- 10 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 43/1
10 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ను వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 4 ఫొర్ల సాయంతో 24 పరుగులు, స్మిత్ 29 బంతుల్లో 3ఫోర్ల సాయంతో 19 పరుగులు చేశాడు.
- మిచెల్ మార్ష్ డక్‌ఔట్..
ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి స్టీవ్‌స్మిత్ వచ్చాడు.
- టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. తొలుత బ్యాటింగ్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా










