న్యూఢిల్లీ : ఫిబ్రవరి నెల కన్నా.. మార్చిలో భారత సేవల రంగం వృద్ధి తగ్గిందని పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) బుధవారం వెల్లడించింది. ఇక పిఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ప్రకారం... ఫిబ్రవరిలో 59.4 శాతం వృద్ధిరేటు నమోదైంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత సేవల రంగంలో గరిష్టస్థాయిలో వృద్ధిరేటు నమోదైనట్లు పిఎంఐ పేర్కొంది. ఇక మార్చిలో నెలలో వృద్ధిరేటు 57.8 శాతానికి తగ్గింది. అయితే కొత్త బిజినెస్ ఆర్డర్లు పెరిగాయని, రాబోయేరోజుల్లో వృద్ధిరేటు పెరిగే అవకాశముందని నెలవారీ సర్వే బుధవారం తెలిపింది.
కాగా, 2022-23 ఆర్థిక త్రైమాసికం చివరిలో కొత్త వ్యాపారాలు ఊపందుకోవడం వల్ల వృద్ధిరేటు గణనీయంగా పెరిగింది అని ఎస్‌అండ్ పి గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్‌లోఎకనామిక్స్ అసొసియేట్ డైరెక్టర్ పొలియన్నా డే లిమా చెప్పారు. అవుట్‌పుట్‌ల మాదిరిగానే కొత్త వ్యాపారాలు ఊపందుకుంటే..వృద్ధిరేటు క్రమంగా పెరిగే అవకాశముందిని డే లిమా అన్నారు. ఇక ప్రస్తుతం పెరిగిన ఖర్చులకనుగుణంగా గణనీయమైన సంఖ్యలో సేవల సంస్థలు విక్రమ ధరలను పెంచాయి.










