- సగం వాటా ఈ రెండు దేశాలదే
వాషింగ్టన్ : ప్రపంచ వృద్థి రేటులో భారత్, చైనాలు కీలక పాత్రను పోషించనున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిష్టాలినా జార్జివా పేర్కొనాురు. ప్రపంచ వృద్థిలో ఈ రెండు దేశాల వాటా సగానికి పైగా ఉంటుందని ఆమె తెలిపారు. 2023లో ప్రపంచ వృద్థి 3 శాతం లోపే ఉంటుందని ఆమె అంచనా వేశారు. జనవరిలో అంచనా వేసినట్టుగా 2.9 శాతం వద్దే వృద్ధి రేటు ఉంటుందని, ఆర్థిక మాంద్యం సుదీర్ఘకాలం కొనసాగుతునుందున వచ్చే ఐదేళ్లలో ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు ఏమీ ఉండకపోవచ్చని ఆమె అన్నారు. .
''1990ల నుండి మా అత్యల్ప మధ్య కాలిక వృద్థి రేటు ఇదే. గత రెండు దశాబ్దాల నుండి సగటున 3.8 శాతం కన్నా లోపు నమోదవుతూ వస్తోంది. 2023లో అభివృద్థి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో 90 శాతం దాకా జిడిపిలో క్షీణతను చవి చూశాయని ఆమె పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం , ఆర్థిక కార్యకలాపాలు మందగించడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఐఎంఎఫ్ చీఫ్ పేర్కొనాురు. అల్పాదాయ దేశాల ఎగుమతులు, దిగుమతులు బలహీనపడడంతో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నాయని అన్నారు. దీనివల్ల పేదరికం, ఆకలి తీవ్ర రూపం దాల్చే అవకాశముందని జార్జివా పేర్కొన్నారు. వారం రోజుల్లో ఐఎంఎఫ్ వార్షిక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో జార్జివా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.










