May 10,2023 17:05

న్యూఢిల్లీ : వినియోగదారుల అవసరాలకనుగుణంగా ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డిసి) ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల అవసరాలకనుగుణంగా డిజిటల్‌ పబ్లిక్‌ గూడ్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కొన్నింటిని అభివృద్ధి చేసింది. దీన్నే మరింత అభివృద్ధిపరిచే దిశగా.. డిజిటల్‌ మౌలిక సదుపాయాలను మరింత విస్తరించేందుకుగానూ వాణిజ్యశాఖ ఓపెన్‌ నెట్‌వర్క్‌ ప్లాట్‌ఫామ్‌ని అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు కూడా.. ఆధార్‌, జన్‌ధన్‌, కోవిన్‌ వంటి ప్రయోగాత్మక చర్యల మాదిరిగానే ఈ ఓఎన్‌డిసి ఉండనుందని వాణిజ్యశాఖ ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఓఎన్‌డిఎస్‌) అనేది ఇంటర్నెట్‌లో వస్తువులు, సేవలను మార్పిడి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా వస్తువు అమ్మకం, కొనుగోలు చేయడానికి, వ్యాపార లావాదేవీలకు ఈ ప్లాట్‌ఫారమ్‌ ఉపయోగపడుతుంది.