అక్టోబర్ 14 న జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు కేవలం 1 గంటలోనే అమ్ముడయ్యాయి. అలాగే భారత్ ఆడిన మిగిలిన 8 మ్యాచ్ల టికెట్లన్నీ కేవలం నాలుగు గంటల్లోనే అమ్ముడుపోయాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం నిన్న టికెట్లను అందుబాటులోకి తీసుకురాగా, కేవలం గంటలోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు బుక్ మై షో ద్వారా ఆన్ లైన్‌లో టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. 7 గంటల తర్వాత ఒక్క టికెట్ కూడా మిగల్లేదంటే చిరకాల ప్రత్యర్థుల పోరుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలుస్తుంది.
మంగళవారం టికెట్లు బుక్ చేసుకోవడంలో విఫలమైన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాస్టర్ కార్డ్ వినియోగదారులకు మాత్రమే ప్రీ-సేల్ అవకాశం కల్పించారు. భారత్ వార్మప్ మ్యాచ్ ల కోసం ఆగస్టు 30 నుండి వివిధ దశలలో అన్ని మ్యాచ్ ల టిక్కెట్లు లైవ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 31 నుంచి భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లకు అభిమానులు టికెట్లు కొనుగోలు చేయవచ్చు.










