Oct 27,2023 22:20

కౌలాలంపూర్‌: 11వ సుల్తాన్‌ జహోర్‌ కప్‌లో భారత పురుషుల హాకీజట్టును పాకిస్తాన్‌ జట్టు నిలువరించింది. గ్రూప్‌ాబిలో భాగంగా శుక్రవారం జరిగిన భారత్‌ాపాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన లీగ్‌మ్యాచ్‌ నిర్ణీత సమయం ముగిసే సరికి 3ా3గోల్స్‌తో డ్రా అయ్యింది. తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్స్‌ చేయడంలో విఫలం కాగా.. రెండోక్వార్టర్‌లో భారత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. దీంతో భారత్‌ 1ా0 ఆధిక్యతలో నిలిచింది. మూడో క్వార్టర్‌లో పాకిస్తాన్‌ ఒక గోల్‌ చేయగా.. నాల్గో క్వార్టర్‌లో ఇరుజట్లు రెండేసి గోల్స్‌తో రాణించాయి. ఇందులో ఒక్కో ఫీల్డ్‌ గోల్‌, మరోటి పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచాయి. ఈ టోర్నీలో భారత హాకీ జూనియర్‌ జట్టు ప్రాతినిధ్యం వహిస్తోంది. టోర్నీలో మొత్తం 8జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. గత ఏడాది 6జట్ల మధ్య ఈ టోర్నీ జరగ్గా ఈసారి మరో రెండుజట్లు అదనంగా వచ్చి చేరాయి. మరో పోటీలో న్యూజిలాండ్‌ జట్టు 3ా2గోల్స్‌ తేడాతో ఆతిథ్య మలేషియాను చిత్తుచేసింది. ఇక గ్రూప్‌ాఎలో ఆస్ట్రేలియా 3ా0తో గ్రేట్‌ బ్రిటన్‌ను ఓడించింది.