
కదలండి ముందుకు
స్వతంత్ర వేడుకలకు
భారతావనిని కీర్తిస్తూ
'జైహింద్' అని నినదిస్తూ
'వందేమాతరం' పాడేస్తూ
స్వతంత్ర వీరులను స్తుతిస్తూ ...
పదండి ముందుకు
స్వేచ్ఛా సంబరాలకు
అల్లూరి అడుగులతో
భగత్ సింగ్ పిడుగులతో
ఆజాద్ మెరుపులతో
సర్దార్ ఉరుములతో
సాగండి ముందుకు
జెండా పండుగకు
గాంధీజీ సిద్ధాంతాలతో
నెహ్రూజీ ఆచరణలతో
అంబేద్కర్ ఆశయాలతో
సుభాష్‌ని సంకల్పంతో
ఎగురవేయండి వినువీధిలో
త్రివర్ణ పతాక రెప రెపలను
-కయ్యూరు బాలసుబ్రమణ్యం
7780277240