Jun 17,2023 11:13

గుంటూరు : పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ... వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌ విలాస్‌ సెంటర్లో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. నేతలు మాట్లాడుతూ ... వినియోగదారుడు 10 సంవత్సరాల క్రితం వాడుకున్న కరెంటుకి బిల్లు ఆనాడే చెల్లించటం జరిగిందని, కానీ వైసిపి ప్రభుత్వం పది సంవత్సరాల క్రితం వాడిన కరెంటుకి, యూనిట్‌ కి 40 పైసలు చొప్పున ఇంధనకు సర్చార్జి, ట్రూ ఆఫ్‌ చార్జీల పేరుతో వసూలు చేయటం అన్యాయమన్నారు. దీనికి తోడు స్మార్ట్‌ మీటర్ల పేరుతో రాబోయే 120 నెలల పాటు గృహానికి 120 రూపాయల నుంచి 200 రూపాయలు వసూలు చేయటం ప్రజలపై అధిక భారం అని ఈ భారలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.