హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో కిమ్స్ హాస్పిటల్స్ 9.3 శాతం వృద్థితో రూ.86.67 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.79.24 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.500.84 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ1లో 21.62 శాతం పెరిగి రూ.609.14 కోట్లకకు చేరింది. ''తొలి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించాము. సాధారణంగా సీజనల్‌గా బలహీనమైన త్రైమాసికం అయినప్పటికీ.. పలు కీలక పారమీటర్స్‌తో రాణించాము.'' అని కిమ్స్ హాస్పిటల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బి భాస్కర రావు తెలిపారు. సోమవారం బిఎస్‌ఇలో కిమ్స్ హాస్పిటల్స్ షేర్ 0.43 శాతం పెరిగి రూ.1,854.85 వద్ద ముగిసింది.