
ప్రజాశక్తి -కాళ్ళ (పశ్చిమగోదావరి) : ప్రజాశక్తి 43వ వార్షికోత్సవసభ మంగళవారం ప్రాతళ్ళమెరక గ్రామ సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను గ్రామ ఉప సర్పంచ్ కంతేటి చంద్రావతి సుబ్బరాజు, పంచాయతీ కార్యదర్శి బస్వానీ ఏసుబాబులు ఆవిష్కరించారు. అనంతరం ప్రజాశక్తి జిల్లా ఏ డి వి డి ఇంఛార్జి పి నారాయణరాజు అధ్యక్షతన జరిగిన సభలో గ్రామ ఉప సర్పంచ్ కంతేటి చంద్రావతి సుబ్బరాజు మాట్లాడుతూ.. ప్రత్యేక సంచిక రంగుల్లో ప్రచురించడం ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ.. ఎనిమిది పేజీల్లో ప్రకటనలతో పాటు ప్రత్యేక కథనాలతో తీసుకురావడం అభినందనీయమన్నారు. పంచాయతీ కార్యదర్శి బస్వానీ ఏసుబాబు మాట్లాడుతూ ఎటువంటి స్వార్థం లేకుండా, ప్రజా హితం కోసం పని చేస్తున్న ఏకైక పత్రిక ప్రజాశక్తి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉన్న పత్రిక భవిష్యత్‌లో మరింత వద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి అక్షరం ప్రజలు పక్షం అన్నా ట్యాగ్ లైన్‌కు అనుగుణంగా ప్రజల కోసం పని చేస్తున్న పత్రికను మరింత పెంచి ప్రజలుల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పల్లిపాలెం పంచాయతీ కార్యదర్శి జేవిఎస్‌ఎస్ మూర్తి బొడ్డు రామకృష్ణ, వెల్ఫేర్ అసిస్టెంట్ చెల్లు శ్రీకాంత్, డిజిటల్ అసిస్టెంట్ షేక్ రుసా, భీమవరం డివిజన్ ఇంచార్జ్ గుండా సాయికుమార్, కాళ్ళ రిపోర్టర్ గొట్టేటి శ్రీనివాసులు, భీమవరం సర్కులేషన్ ఇన్చార్జి పెద్దిరాజు, వాలంటీర్లు ఝాన్సీ, చంద్రకళ, ఆశ, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.