
ముంబయి : ప్రపంచకప్‌లో తిరుగులేని విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టిన భారత జట్టు మరికొన్ని గంటల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత్‌కు డ్రీమ్‌రన్‌గా మిగిలిపోనుంది. ప్రస్తుత ప్రపంచకప్ లీగ్ దశలో కివీస్‌ను టీమిండియా ఓడించింది. గత రెండు ప్రపంచకప్‌లలో ఫైనల్‌కు చేరుకున్న కివీస్ ఈసారి కూడా ఫైనల్‌కు చేరుకోవాలని పట్టుదలగా ఉంది. ఆస్ట్రేలియా ఐదుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది. భారత్-న్యూజిలాండ్ జట్లు రెండూ బలంగా ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. కివీస్ కూడా బ్యాటింగ్‌తోపాటు పేస్ అటాక్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. సెమీస్ పోరుపై టీమిండియా స్కిప్పర్ రోహిత్‌శర్మ మాట్లాడుతూ.. ఇరు జట్ల బలాబలాలు, వాంఖడేలో జరిగిన గత మ్యాచ్‌లు ఫలితాన్ని నిర్ణయించబోవని, టాస్ మాత్రమే దానిని నిర్ణయిస్తుందని చెప్పారు.