Jul 24,2023 08:28

బహిరంగంగా
దేహాలను దిగంబరంగా
ఊరేగించిన ఉన్మాదుల రాజ్యమిది
విలువలు, వలువలై
ఆత్మాభిమానం అమ్ముడుబోయిన
ఆటవిక కబోదుల్లున్న
దుర్మార్గపు కాషాయ కాలమిది
నువ్వు సిగ్గుపడకు తల్లీ...
ఎక్కడ పుడితేనేం... ఎవ్వరికి పుడితేనేం...
నీ మర్మస్థలం వారికి జన్మ స్థానం

చట్టాల్ని ఏ చూరులో చుట్టారో
అర్థం కాని అయోమయం...!
అధికారం, అహంకారం
ఏ ఏసీల్లో నిదురబోయిందో అని
సామాన్యుని ఆక్రోశం...
మానం మంటగలిసిన దేశంలో
మనిషిగా ఎటు వెళ్తున్నామో
తెలియని అనిశ్చితి
పాలకులూ కళ్ళు తెరవండి
దేశ, మాన ప్రాణాలను కాపాడండి..!
 

- మహబూబ్‌ బాషా చిల్లెం