న్యూఢిల్లీ : కేవలం విద్యుత్ వాహన క్యాబ్‌లకు మాత్రమే అనుమతించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఉబెర్ ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల నగరంలో లక్ష మందికి పైగా డ్రైవర్ల జీవితంపై ప్రతికూల ప్రభావం పడనుందని పేర్కొంది. ఇది పూర్తిగా క్యాబ్ సర్వీసుల రంగాన్ని మూసివేసేలా ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం ఉందని తెలిపింది. ఉబర్, ఓలా వంటి రైడ్ హైలింగ్ కంపెనీలు వాడే వాహనాల నియంత్రణకు కొత్త పాలసీ తేనున్నట్లు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇవిలను మాత్రమే టాక్సీలుగా వాడాలనే నిర్ణయం అమలు సాధ్యం కాదని పేర్కొంది.










