May 28,2023 07:33

ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దల్లో జ్ఞాపకశక్తి తగ్గుతోంది. ఈ మతిమరుపు సమస్య యువతలో కూడా కనిపించడం ఆందోళన కలిగించే విషయం. అయితే కొన్ని రకాల ఆహారపదార్థాలను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఈ మతిమరుపు సమస్య నుంచి బయటపడొచ్చు.

  •  ప్రతిరోజూ బాదం, వాల్‌నట్‌ లేదా జీడిపప్పు తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది
  •  క్యాబేజీ, ఉల్లిపాయలు, బ్రోకలీ వంటి కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటిల్లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.
  •  పాలు, పెరుగు, కొవ్వు చేపలు, చిక్కుళ్ళు, బీన్స్‌, గుమ్మడి గింజలు, గోధుమలు, బార్లీ, వోట్స్‌ మొదలైన మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
  •  మొలకలు, బచ్చలికూర, క్యారెట్లు, చిలగడదుంపలు మొదలైన కూరగాయలను తీసుకోవడంతో పాటు పచ్చి కూరగాయలను ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి.
  •  గుడ్డు సొనలు, తృణధాన్యాలు, సోయాబీన్స్‌, నువ్వుల గింజలు లెసిథిన్‌ అనే పోషకాన్ని కలిగి ఉంటాయి. ఇది జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
  •  విటమిన్‌ బి12 పుష్కలంగా ఉండే గుడ్లు, చికెన్‌, చేపలు, పాలు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి, అలాగే జ్ఞాపకశక్తి పెంచడంలో సహాయపడతాయి.
  •  నిమ్మ, నారింజ, ఉసిరి, క్యాప్సికం, ఆకు కూరలు వంటి విటమిన్‌ సి అధికంగా ఉండే సిట్రస్‌ పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.