Aug 11,2023 21:40

- హాజరుకానున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు
ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ :ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) 12వ రాష్ట్ర మహాసభ ఈ నెల 12, 13 తేదీల్లో గుంటూరులోని శుభం కన్వెన్షన్‌లో జరగనుంది. మొదటిరోజు ప్రారంభ సభకు మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్‌, ఎమ్మెల్సీ, మహాసభ ఆహ్వాన సంఘం చైర్మన్‌ కెఎస్‌.లక్ష్మణరావు, ఐలు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సుంకర రాజేంద్రప్రసాద్‌, నర్రా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బార్‌కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, ఐలు జాతీయ కార్యదర్శి పి.వి.సురేంద్రనాద్‌, ఐలు తెలంగాణ అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ, కేరళ రాష్ట్ర ఐలు ప్రధాన కార్యదర్శి సి.పి.ప్రమోద్‌, ఐఎఎల్‌ రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు, గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కె.వి.కె.సురేష్‌ పాల్గొంటారు. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 600 మంది ప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర నుండి న్యాయవాదులు హాజరు కానున్నారు. గత కార్యక్రమాలపై సమీక్షించి, భవిష్యత్‌ కర్తవ్యాలను నిర్దేశించుకోనున్నారు. రెండో రోజు 'ప్రజాస్వామ్యం పరిరక్షణ- రాజ్యాంగ పరిరక్షణ' అంశంపై జరిగే సెమినార్‌లో ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్‌ ప్రధాన వక్తగా హాజరుకానున్నారు. గుంటూరు జెసి న్యాయ కళాశాల ప్రిన్సిపల్‌ సిహెచ్‌.సుధాకర్‌బాబు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, డొక్కా మాణిక్య వరప్రసాద్‌ తదితరులు సెమినార్‌లో పాల్గంటారు. వివిధ సమస్యలపై ప్రతినిధులు చర్చించి, తీర్మానాలు ఆమోదించనున్నారు. నూతన కమిటీని ఎన్నుకోనున్నారు.