Apr 22,2023 11:27

గొలుగొండ (అనకాపల్లి) : గొలుగొండ మండలంలోని సాలిక మల్లవరం సమీపంలో ఉన్న అటవీ భూమిలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అక్రమంగా రంగురాళ్ల తవ్వకాలు జరిగాయి. జెసిబితో సుమారు మూడు గంటలపాటు క్వారీలో తవ్వకాలు జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. తవ్విన మట్టిని లారీల్లో తాండవ రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న రోడ్డు ద్వారా గొలుగొండ మండలాన్ని దాటించినట్లుగా సమాచారం. క్వారీ ప్రాంతం వద్ద పహారా కాయాల్సిన అటవీ సిబ్బంది ఆచూకీ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ, ఇదే అదునుగా చూసి పక్కా ప్రణాళికతో సమీపంలో ఉన్న జీడి తోటల్లో వాహనాలను ఉంచి శుక్రవారం అర్ధరాత్రి తవ్వకాలు చేశారనీ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.