Aug 07,2023 07:39

సమయానికీ స్థలానికే కాదు
దేశానికి కూడా దూరంగా
పిల్లలిపుడు
అన్ని సముద్రాలకావల
ఎలా తెలుస్తుంది?
ఎవరెక్కడ ఉన్నారో
ఎలా ఉన్నారో
పిల్లలు నవ్వుతారు గానీ
వాళ్లున్న దగ్గర
ఊహించని ఏ వార్త తెలిసినా
వాళ్లతో మాటాడే వరకూ
ఎన్ని శంకల ఊగిసలాటో
ఎన్నెన్ని ప్రయాసలో ...
బయటపడరు గానీ
ఇక్కడ నుండి ఏమి తెలిసినా
మనతో మాటాడేవరకూ
వాళ్లకీ అంతే !
కలుసుకుందుకో
ఏదోలా మాటాడుకుందుకో
ఏ వెసులుబాటూ లేకపోతే
ఎన్నాళ్ల గుంజాటనో
మనకైనా వాళ్లకైనా ...
 

- ముకుంద రామారావు
99083 47273