హైదరాబాద్ : హిట్ సినిమాలతో జోష్ మీదున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు రవి శంకర్, నవీన్ నివాసాలు, కార్యాలయాలతోపాటు, దర్శకుడు సుకుమార్ ఇంటిపైనా ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. బంజారాహిల్స్, మాదాపూర్ జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ ఏడాది నందమూరి బాలకృష్ణతో 'వీర సింహారెడ్డి', మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య' సినిమాలు తీసింది. ఈ రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు వచ్చాయి. వాటికి సంబంధించిన ఫైల్స్ తనిఖీ చేశారు. ఇప్పుడు 'పుష్ప 2' చిత్రాన్ని నిర్మిస్తోంది. దర్శకుడు సుకుమార్ మైత్రిమూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలకు భాగస్వామిగా కొనసాగుతున్నారు. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలను సైతం చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల గురించి సుకుమార్‌ను ప్రశ్నించారు. దాంతో ఆయన పుష్ప షూటింగ్ సెట్ నుంచి హుటాహుటీనా ఇంటికి వచ్చినట్లు సమాచారం