Nov 08,2023 14:42

ఖమ్మం: మాజీ మంత్రి, ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు సోదాలు చేపట్టారు. శ్రీ సిటీలో ఉన్న తుమ్మల నివాసంలో ఈసీకి సంబంధించిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో తుమ్మల ఇంట్లో లేరు. సీ-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసినట్లు అధికారులు తెలిపారు. తుమ్మల సతీమణి భ్రమరాంబ సోదాలకు సహకరించినట్లు అధికారులు చెప్పారు.