Mar 11,2023 21:25

ముంబయి : ఐడిఎఫ్‌సి మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌గా పేరు మార్చుకుంది. మార్చి 13 నుంచి కొత్త పేరుతో కనిపించనుంది. తదనుగుణంగా ఈ ఫండ్‌ హౌస్‌ ప్రతి పథకానికి ఐడిఎఫ్‌సి పదానికి బదులుగా బంధన్‌ పదం కనిపించనుందని ఆ సంస్థ వెల్లడించింది. పెట్టుబడుల వ్యూహాలు, ప్రక్రియలు, బఅందం మాత్రం అదే కొనసాగుతుందని పేర్కొంది. మదుపరులు, అదే తరహా అత్యున్నత నాణ్యత కలిగి పెట్టుబడుల విధానంతో ప్రయోజనం పొందగలరని ఎఎంసి సిఇఒ విశాల్‌ కపూర్‌ పేర్కొన్నారు. రీ బ్రాండింగ్‌ పేరు, లోగో మారనుందన్నారు. బంధన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ ఫండ్‌ హౌస్‌ ప్రయాణంలో నూతన అధ్యాయానికి ప్రతీకగా నిలువడంతో పాటుగా తమ వ్యాపారాలకు నూతన శక్తిని తీసుకురానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.