Jul 31,2023 21:22

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ నికర లాభాలు 61 శాతం పెరిగి రూ.765 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.474 కోట్ల లాభాలతో పోల్చితే 61 శాతం వృద్థి సాధించింది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 36 శాతం పెరిగి రూ.2,751 కోట్లుగా చోటు చేసుకుంది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 2.17 శాతానికి తగ్గాయి. 2022 ఇదే జూన్‌ నాటికి 3.36 శాతం జిఎన్‌పిఎ చోటు చేసుకుంది. నికర ఎన్‌పిఎలు 1.30 శాతం నుంచి 0.70 శాతానికి పరిమితమయ్యాయి.