న్యూఢిల్లీ : ప్రస్తుత పండగ సీజన్‌లో రుణగ్రహీతలను ఆకర్షించడానికి ఐడిబిఐ బ్యాంక్ 'రిటైల్ లోన్ ఫెస్ట్'ను ప్రకటించింది. అక్టోబర్ 16, 17 తేదిల్లో తమ 125పైగా శాఖల్లో 'బ్యాంక్ ఎయిసా దోస్త్ జయిసా' నినాధంతో ప్రత్యేక క్యాంపెయిన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఖాతాదారుల అవసరాలను తీర్చడానికి ఆకర్షణీయ విధానాలను అనుసరిస్తున్నామని ఐడిబిఐ బ్యాంక్ డిఎండి సురేష్ ఖటన్హర్ పేర్కొన్నారు.