కర్నూల్ : ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్ నంద్యాల్ పట్టణంలోని టెక్కిలో నూతన శాఖను తెరిచినట్లు వెల్లడించింది. దీన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారని పేర్కొంది. ఈ శాఖలో సిఆర్‌ఎం మిషన్ సహా డిపాజిట్లు, ఉపసంహరణల సర్వీసులను అందించనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 235 శాఖలు, 480 ఎటిఎంలతో విస్తరించినట్లు తెలిపింది.