ముంబయి : ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్ 2023ా24 జులై నుంచి సెప్టెంబర్ త్రైమాసికం(క్యూ2)లో 35.8 శాతం వృద్థితో రూ.10,261 కోట్ల లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.7557.84 కోట్ల లాభాలు ఆర్జించింది. క్రితం క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 23.8 శాతం పెరిగి రూ.18,308 కోట్లకు చేరింది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగింది. బ్యాంక్ జిఎన్‌పిఎ 2.76 శాతం నుంచి 2.48 శాతానికి తగ్గింది. నికర ఎన్‌పిఎలు 0.61 శాతం నుంచి 0.43 శాతానికి పరిమితమయ్యాయి.