
దుబాయ్: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో ఆదివారం భారత్-నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌తో లీగ్ మ్యాచ్‌లు ముగిసాయి. ఈ మ్యాచ్‌కు ముందే సెమీస్‌కు చేరిన జట్లు ఏవో తేలిపోయాయి. గ్రూప్ స్టేజ్‌లో అగ్రస్థానంలో ఉన్న భారతజట్టు 4వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో తొలి సెమీఫైనల్లో తలపడనుంది. అదే క్రమంలో 2, 3 స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ పోరు జరగనుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) సెమీఫైనల్‌కు అధికారిక అంపైర్ల ఎవరెవరు ఉండనున్నారో సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 15(బుధ)న భారత్‌ాన్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి సెమీస్‌కు రాడ్ టక్కర్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఫీల్డ్ అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. భారత్‌ాన్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి సెమీస్‌తో అంపైర్ టక్కర్ అంపైర్ కెరీర్‌లో 100వ మ్యాచ్‌కు బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య 16(గురు)న జరిగే రెండో సెమీస్‌కు నితిన్ మీనన్‌ారిచర్డ్ కెటెల్‌బ్రో ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు. తొలి సెమీస్‌కు ముంబయి, రెండో సెమీస్‌కు కోల్‌కతాలో జరగనున్నాయి.ఇల్లింగ్‌వర్త్ 2019 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో భారత్‌ాన్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన సెమీస్‌కు బాధ్యతలు నిర్వర్తించగా.. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 18 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.