Oct 15,2023 17:50

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు లభించింది. గిల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును గెలుచుకున్నాడు. 2023 సెప్టెంబర్‌లో అత్యుత్తమ ప్రదర్శనకుగాను గిల్‌కు ఈ అవార్డు దక్కింది. మరోవైపు గిల్‌ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు రెండు సార్లు దక్కించుకున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఏడాది జనవరిలో కూడా గిల్‌ తొలిసారి ఇదే అవార్డును దక్కించుకున్నాడు.