
ఎడమకాలి చీలమండలి పాదానికైన గాయం కారణంగా ... హార్దిక్ పాండ్య ఇప్పుడు టోర్నీకి దూరమయ్యారు. చీలమండ గాయం నుంచి హార్దిక్ కోలుకోకపోవడంతో అతడి స్థానంలో మరొక యువ బౌలర్‌ను భారత్ తన జట్టులోకి తీసుకుంది. గాయం కారణంగా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టోర్నీకి దూరమైనట్లు ఐసీసీ ప్రకటించింది.
ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాల దిశగా భారత జట్టు దూసుకుపోతోంది. ఇప్పటివరకు మెగాటోర్నీలో ఆడిన ఏడుకు ఏడు మ్యాచుల్లోనూ టీమిండియా నెగ్గింది. వరుసగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో పాటు శ్రీలంకను చిత్తు చేసింది. అన్ని విభాగాల్లోనూ అత్యంత బలంగా ఉన్న టీమిండియాతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు భయపడిపోతున్నారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ సమయంలో బంతిని ఆపే క్రమంలో హార్దిక్ గాయపడ్డాడు. చీలమండ గాయం కావడంతో అతడు జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లిపోయాడు. తొలుత మూడు మ్యాచ్‌లకు దూరమవుతాడని మేనేజ్‌మెంట్ చెప్పినా.. గాయం తీవ్రత కారణంగా అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు హార్దిక్ దూరమైనట్లు ఐసిసి ధ్రువీకరించింది. అతడి స్థానంలో యువ పేసర్ ప్రసిధ్ కఅష్ణను టీమిండియా మేనేజ్‌మెంట్ భర్తీ చేసింది.