
ఢిల్లీ : టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమిపై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ దిగ్గజాలు విమర్శలు, సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ గంగూలీ స్పందిస్తూ.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గంగూలీ కీలక సలహా ఇచ్చారు. టెస్ట్ క్రికెట్ ఆడాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాండ్యా టెస్ట్ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందని చెప్పారు. తన మాటను పాండ్యా వింటున్నాడనుకుంటానని తెలిపారు. ఒక్క ఓటమితో టీమిండియా సత్తాను తప్పుపట్టలేమని... భారత జట్టులో ఎంతో ట్యాలెంట్ ఉందని గంగూలీ చెప్పారు. ఇదే సమయంలో జట్టులోకి యువ ఆటగాళ్లను తీసుకురావాల్సి ఉందన్నారు.