Apr 01,2023 21:30

హైదరాబాద్‌ : ఒకాయ విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు ఎఐఎస్‌ 156 సవరణ మూడో దశ కింద ఐకాట్‌ ధృవీకరణ పొందినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది ఇవిల కోసం డిజైన్‌, నిర్మాణం, ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బ్యాటరీ ప్యాక్‌ అలాగే దాని భాగాలను పరీక్షించడంతో పాటు అన్ని భద్రతా అవసరాలను కవర్‌ చేస్తుందని తెలిపింది. దీంతో కొత్త నిబంధనలకు పూర్తిగా అనుగుణంగా ఉండే ఇవి మొదటి తయారీదారులలో ఒకటిగా ఒకాయ మారిందని పేర్కొంది.