Mar 02,2023 21:23

హైదరాబాద్‌ : ఎన్‌ఎండిసి ముడి ఇనుప ఖనిజం గనులకు ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ (ఐబిఎం) 5 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కిరన్‌డుల్‌ డాపాజిట్‌-14ఎంజడ్‌, కిరన్‌డుల్‌ డిపాజిట్‌-14 ఎన్‌ఎంజడ్‌, బచెలి డిపాజిట్‌-5 గనులకు ఈ విశిష్ట గుర్తింపు లభించిందని పేర్కొంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ గుర్తింపు పత్రాన్ని పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ఎన్‌ఎండిసి ప్రొడక్షన్‌ డైరెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ మోహంతికి అందజేశారని తెలిపింది.