Feb 27,2023 20:42

న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందారు తన అల్కజార్‌ మోడల్‌ను కొత్త ఇంజిన్‌తో ఆవిష్కరించినట్లు తెలిపింది. 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజన్‌తో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. ఈ వేరియంట్‌ కోసం రూ.25,000తో బుకింగ్స్‌ ప్రారంభించినట్లు పేర్కొంది. మ్యాన్యువల్‌ వెర్షన్‌ లీటర్‌కు 17.5 కిలోమీటర్ల మైలజీని అందించగా, డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ వెర్షన్‌ 18 కిలోమీటర్ల మైలేజ్‌ అందిస్తుందని తెలిపింది. కొత్త హ్యుందారు అల్కజార్‌ ఐడిల్‌ స్టార్ట్‌ అండ్‌ గో ఫంక్షన్‌తో కూడా వస్తుందని పేర్కొంది. దీంతో ఎక్కువ ట్రాపిక్‌ ఉన్న సమయంలో కొంత ఇంధనాన్ని అదా చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపింది.