హైదరాబాద్: యూజ్డ్ కార్ల విక్రయాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని కార్స్24 ఫౌండర్ గజేంద్ర జంగిద్ అన్నారు. 2022 సంవత్పరం ప్రధమార్థంతో పోల్చితే ఈ ఏడాది ప్రధమార్ధంలో అమ్మకాలు ఏకంగా 156 శాతం వృద్ధి చెందాయన్నారు. వినియోగదారుల ప్రాధాన్యాల్లో మార్పులు సహా వాహన యాజమాన్య వ్యయాలు తగ్గటం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయని తెలిపారు. 2016లో కార్స్24 తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టిందని, అప్పటి నుంచి శరవేగంగా కార్యకలాపాలు విస్తరిస్తూ వస్తోందన్నారు. రాష్ట్రంలోని మరో 4 నగరాల్లో కార్స్24.. యూజ్డ్ కార్ల విక్రయాలు, కొనుగోలు వంటి సేవలందిస్తోందన్నారు.










