హైదరాబాద్ : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివఅద్ధి చెందుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శాసనసభలో పట్టణ ప్రగతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నగర అభివృద్ధి తమ ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. ఈ వ్యాఖ్యలను మంత్రి తలసాని తప్పుబట్టారు.గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ లీడర్‌కు గతి లేకుండా పోయింది అని తలసాని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఏం జరిగిందో ఈ ప్రపంచమంతా చూస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. ఒక నూతనమైన ఒరవడిలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, స్టీలు బ్రిడ్జిలు, లింక్ రోడ్లును అభివఅద్ధి చేశారు. ఎస్‌ఆర్‌డీపీ కింద పలు అభివఅద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నాలాలను అభివృద్ధి చేశారు. కరెంట్, మంచినీటి విషయంలో హైదరాబాద్ ప్రజలకు ఇబ్బందులు లేవు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే చాలు నీటి కష్టాలుండేవి. ఎల్‌ఈడీ లైట్లు, పార్కులు, ఫుట్‌పాత్‌లను అభివఅద్ధి చేశాం. హైదరాబాద్ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ పాలనలో ఎలాంటి ధర్నాలు, ఆందోళనలు లేవు. పేదోళ్లు బాగుపడితే కాంగ్రెసోళ్లకు ఎందుకు ఇష్టం ఉండదు. బడుగు, బలహీన వర్గాల కోసం హైదరాబాద్ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తున్నాం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.










