- సమీహా అయూబ్
మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం. ఈ ఏడాది ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా ఈజిప్ట్‌కు చెందిన నటి సమీహా అయూబ్ సందేశం ఇచ్చారు. సమీహా ఈజిప్షియన్ ... కైరోలోని శుబ్రా పరిసరాల్లో జన్మించారు. ఆమె 1953లో హయ్యర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ నుంచి పట్టభద్రురాలైంది. అక్కడ ఆమెకు ప్రసిద్ధ నాటక రచయిత జాకీ తులైమత్ బోధించారు. రబా అల్- అదావియా, సెక్కత్ అల్-సలామా, బ్లడ్ ఆన్ ది కర్టెన్స్ ఆఫ్ ది కాబా, అఘా మెమ్నోన్, ది కాకేసియన్ చాక్ సర్కిల్‌తో సహా ఆమె కళాత్మక కెరీర్‌లో రంగస్థలంపై ఆమె చేసిన ప్రదర్శనలు సుమారు 170 నాటకాలు. ఆమె చాలా నాటకాలు, సినిమా, టెలివిజన్‌కు కూడా చాలా రచనలు చేశారు. చలనచిత్రంలో ఆమె ది ల్యాండ్ ఆఫ్ హిపోక్రసీ, ది డాన్ ఆఫ్ ఇస్లాం, విత్ హ్యాపీనెస్, అమాంగ్ ది రూయిన్స్, టెలివిజన్‌లో అనేక చిత్రాల ద్వారా ప్రత్యేకత పొందింది. పలు గౌరవాలూ, పురస్కారాలూ పొందారు.
ఆమె సందేశ పూర్తి పాఠం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రంగస్థల కళాకారులందరికీ, ఈ సందేశాన్ని రాస్తూ, ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. మనమందరం అనుభవించే థియేటర్, నాన్-థియేటర్ కళాకారుల కళాత్మక బరువుతో నా ప్రతి అణువూ వణుకుతోంది.
నేటి ప్రపంచ స్థితిగతుల మధ్య నలిగిపోతూ, ఒత్తిళ్లు, మిశ్రమ భావాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్థిరత్వం అనేది లేక మన భౌతిక ప్రపంచంపై మాత్రమే కాకుండా మన ఆధ్యాత్మిక ప్రపంచంపై, మన మానసిక ప్రశాంతతపై కూడా వినాశకరమైన ప్రభావాలను కలిగి ఉన్న సంఘర్షణలు, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలపరంగా ఈ రోజు మన ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రతి సంక్షోభానికి ప్రత్యక్ష సాక్షులం.
గర్జించే సముద్రం మధ్యలో సుదీర్ఘ సంచారం తర్వాత దానిని సురక్షితమైన నౌకాశ్రయానికి చేర్చాలనే ఆశతో అది తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. మన ప్రపంచం ఇంతగా ఒకప్పటి కంటే, ఒకదానికొకటి మరింత సన్నిహితంగా ఎప్పుడూ అనుసంధానించబడలేదు. కానీ అదే సమయంలో అది ఈనాటి కంటే ఒకదానికొకటి మరింత వైరుధ్యంగా, దూరంగా ఉండబోతోంది. మన సమకాలీన ప్రపంచం మనపై చూపించే నాటకీయ వైరుధ్యం ఇక్కడే ఉంది. భౌగోళిక సరిహద్దుల అన్ని అడ్డంకులను బద్దలు కొట్టే వార్తలు, ఆధునిక సమాచార ప్రసారాల పరంగా మనమందరం చూస్తున్నదే ఐనప్పటికీ, ప్రపంచం చవిచూస్తున్న సంఘర్షణలు ఉద్రిక్తతలు తార్కిక అవగాహన యొక్క పరిమితులను మించిపోయాయి. ఈ స్పష్టమైన కలయికల మధ్య సృష్టించబడిన, మానవత్వపు నిజమైన సారాంశం యొక్క సరళమైన రూపంలో మనలను దూరం చేసే మౌలిక విభేదాలు ఉన్నాయి. రంగస్థలం- దాని అసలు సారాంశం మానవత్వపు నిజమైన సారం ఆధారంగా పూర్తిగా మానవ చర్యలమయమైన జీవితం.
మన గొప్ప మార్గదర్శకుడు కాన్‌స్టాంటిన్ స్టానిస్లావ్‌స్కీ మాటల్లో చెప్పాలంటే, ''మీ బురద కాళ్ళతో థియేటర్‌లోకి ఎప్పుడూ రాకండి. మీ దుమ్ము, ధూళిని బయట వదిలివేసి లోనికి రండి. మీ చిన్న చిన్న చింతలు, గొడవలు, చిన్న ఇబ్బందులు - మీ జీవితాన్ని నాశనం చేసే అనేక విషయాలు, ఇంకా మీలోని కళలను మీ దృష్టిని మరల్చకుండా, వాటిని ప్రవేశ ద్వారం వద్ద వదిలి రండి.'' ''మనం ఒక దశపై పూర్తిగా అదుపులో ఉంచుకొనప్పుడు, ఒక మనిషి కోసం మనందరికీ ఉన్న ఒకే ఒక జీవితంతో మనం కలిసికట్టుగా దానిని అదుపులో ఉంచుకుందాం, కానీ ఈ జీవితానికి మనల్ని విడదీసే గొప్ప సామర్థ్యం కూడా ఉంది. ఈ ప్రపంచంలో మనం ప్రభావితం చేసి అనేక మంది జీవితాల్ని మార్చడానికి, పున:సృజన చేయండి, తద్వారా అది మరింత జీవచైతన్యం పొందుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఇతరులకు దాని సువాసనలను పంచుతుంది.
నాటక ప్రపంచంలో నాటక రచయితలు, దర్శకులు, నటులు, దృశ్యబంధ నిపుణులు, కవులు, సంగీత విద్వాంసులు, కొరియోగ్రాఫర్లు, సాంకేతిక నిపుణులు,వీరు వారనే మినహాయింపు లేకుండా మనం పరిశ్రమించేది- మనం కలిసికట్టుగా ఒకే వేదికపైకి రాకముందు అప్పటికి లేని సమిష్టి జీవితాన్ని సృష్టించే పనుల్లో కృషి చేద్దాం. ఈ జీవితాన్ని ఒడిసి పట్టుకునే శ్రద్ధ, చాతుర్యం గల చేతికి, దానిని స్వీకరించే ప్రేమపూర్వక హృదయానికి, దానితో సహాభూతి, దయ, చూపగల హృదయానికీ, మానవ మనుగడకు అవసరమైన కార్యకారణాలను అందించే తెలివి గల మనస్సుకు అప్పగిద్దాం.
చీకటిలో మెరుస్తూ, రాత్రి చీకట్లను వెలిగిస్తూ, దాని చల్లదనాన్ని వెచ్చదనంతో నింపే మండే కుంపటిలాగా... రంగస్థలంపై మనం చేసేది- శూన్యం నుంచి సృష్టించడం అని నేను చెప్పడంలో అతిశయోక్తి లేదు. జీవితానికి శోభనిచ్చేది మనమే. దాన్ని సాకారం చేసేది మనమే. దాన్ని చైతన్యవంతంగా, అర్థవంతంగా తీర్చిదిద్దేది మనమే. దానిని అర్థం చేసుకోవడానికి మనమే సాధన సంపత్తిని అందిద్దాం.
అజ్ఞానం, అతివాదం అనే చీకట్లను ఎదుర్కొనేందుకు కళల వెలుగును ఉపయోగించుకునే వాళ్లం కావాలి మనం. ఈ లోకంలో జీవచైతన్యం ఆవరించుకునేలా మనం జీవిత దార్శనిక సిద్ధాంతాన్ని స్వీకరించిన వాళ్లమౌదాం. దీనికోసం, మేము మా కృషి, సమయం, చెమట, కన్నీళ్లు, రక్తం, నరాల సత్తువను, ఈ ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించడానికి మనం చేయవల్సిన ప్రతిదాన్ని, సత్యం, మంచితనం, సౌందర్యాత్మక విలువలను పరిరక్షించడమే జీవితానికి అర్హమైన ఉత్క ృష్టమైన కార్యమని ధఢంగా విశ్వసిస్తున్నాను. ఆవిధంగా మనందరం జీవించాలి.
అన్ని కళలకు జన్మదాత 'రంగస్థలం'. మనమంతా కలిసికట్టుగా నిలబడి, భుజం భుజం కలిపి, మన మన రంగస్థల వేదికలపై మనకు చేతనైనట్లుగా, మనదైన స్వరంలో ఉచ్ఛరించి, మనలోంచి మాటల ఊటలతో బయటకు రావాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మొత్తం ప్రపంచం యొక్క మనస్సాక్షిని మేల్కొల్పడానికి, మనిషి తాను కోల్పోయిన సారాన్ని మీలో ప్రతి ఒక్కరూ శోధించడానికి. స్వేచ్ఛ, సహనం, ప్రేమ, సానుభూతి, సున్నితత్వాన్ని గౌరవించే వ్యక్తులుగా, క్రూరత్వం, జాత్యహంకారం, రక్తపాత సంఘర్షణలు, ఏకపక్ష ఆలోచనా ధోరణిని ఇంకా తీవ్రవాదంపై అతి నీచమైన రూపాన్ని తిరస్కరించడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకోండి.
మనిషి వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద, ఈ ఆకాశం కింద నడిచాడు. అలాగే నడుస్తూనే ఉంటాడు. కాబట్టి యుద్ధాలు రక్తపాత సంఘర్షణల బురద నుంచి అతని పాదాలను బయటకు తీయండి. వాటిని వేదిక తలుపు వద్ద వదిలివేసి రమ్మని అతన్ని ఆహ్వానించండి.
బహుశా సందేహాస్పదంగా మారిన మన మానవత్వం మరోసారి వర్గీకృత నిశ్చయంగా మార్చుకుందాం. అప్పుడే మనమందరం మానవులమని, ఆ మానవత్వంలో మనమందరం సోదరులమని గర్వపడటానికి నిజమైన అర్హత సాధించేలా చేస్తుంది. మొట్టమొదటి నటుడు తొలినాటి వేదికపై కనిపించినప్పటి నుంచి ఉన్న ప్రతి కల్మషాన్నీ కడిగివేసుకుని, అవసరమైతే ఎదుర్కోవడంలో అగ్రగామిగా ఉండటమే మన లక్ష్యంగా పెట్టుకుందాం. నాటక రచయితలు, సమస్త కళాకారులు జ్ఞానోదయ జ్యోతిని మోసేవారు అని నేను విశ్వసిస్తూ నా సందేశాన్ని ముగిస్తాను.
- సమిహా అయూబ్
(తెలుగు : మల్లేశ్వరరావు ఆకుల)










