రాశులై పోగుపడే ద్వేషాన్ని చూసి
నదులై పారే విరోధ భావాల్ని చూసి
ఏమిటీ లోకమంటూ
శోకించినాను
గమనమెటులనోనని
మధనపడ్డాను
పరికించి చూడగా అర్థమైంది
సమాజమే ఓ మానవతా కడలియని
కలత చెందుట వ్యర్థమని
కాలుష్యపు కాలువలెన్ని కలిసినా
కలుషితం చేయడం అసాధ్యమని.
ఉత్సాహినై ఎగసి
స్వచ్ఛమైన మంచు బిందువుల్ని తెచ్చి
నా వంతుగా చేర్చినాను
కడలి నవ్వింది కల్మషం లేకుండా
అలలు అలలుగా ...
- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ,
94408 36931










