ఎన్‌టిఆర్ : నేడు జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా ... నందిగామ పట్టణంలో న్యాయమూర్తులు లక్ష్మీ రాజ్యం, రమణారెడ్డి , నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులంతా భారీ ప్రదర్శన నిర్వహించారు. సబ్ కోర్టు ప్రాంగణం నుండి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నెకంటి జీవరత్నం, న్యాయవాదులు పలువురు పాల్గొన్నారు.










