
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. లాసెట్-2023లో ఉత్తీర్ణత సాధించినవారికి ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్, లాసెట్ కన్వీనరు పి ఉమామహేశ్వరి దేవి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థుల ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 17 నుంచి 20 వరకు ఉంటుందని తెలిపారు. 18 నుంచి 22 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. స్పెషల్ కేటగిరి అభ్యర్థులకు 21న ఉంటుందని వివరించారు. 23 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని తెలిపారు. 26న ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 28న అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందని, 29, 30 తేదీల్లో అభ్యర్థులు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని వివరించారు.